మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన ఉప్పరి సాయిలు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. భాధిత కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అనంతరం సాయిలు రైతు భీమాకు అర్హులు కావున వారి సతీమణి నామిని అయినందున వారికి రైతు భీమా 5లక్షల వారం రోజులలోపు వచ్చేలా చూడాలని స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి రజిని కాంత్ కు సంబందించిన డాక్యూమెంట్ ను అందించి పలు సూచనలు చేసారు.వారితో పాటు మర్కుక్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల సత్యనారాయణ ఉప్పరి యాదగిరి మేకల శ్రీనివాస్ బోయిని ఆంజనేయులు ఉపేందర్ చెక్కలి రమేష్ ఉన్నారు*





